టాలీవుడ్ హీరో  రవితేజ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇకపోతే వంశీ కృష్ణ డైరెక్షన్ లో 60 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రేణుదేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.అయితే ఎంతోమంది హీరోలు వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి నో చెప్పారని సమాచారం అందుతోంది. ఇక ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన చంటి అడ్డాలసినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కాగా మెగా కాంపౌండ్ లో ఉన్న స్టార్ హీరోతో టైగర్ నాగేశ్వరరావు సినిమా చేయాలని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.అయితే  డైరెక్టర్ వంశీ కృష్ణ రవితేజతో టైగర్ నాగేశ్వరరావు చేయాలని అనుకున్న సమయంలో భారీ బడ్జెట్ మూవీ రవితేజతో వర్కౌట్ అవుతుందా అని నేను వదులుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక చరణ్, బన్నీ టైగర్ నాగేశ్వరరావు కథ విన్నారని ఈ కథ వాళ్లకు ఎంతగానో నచ్చిందని బన్నీ పుష్ప సినిమాతో బిజీ కావడం, చరణ్ వేర్వేరు కారణాల వల్ల వదులుకోవడంతో రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నారని ఆయన తెలిపారు.

అంతేకాదు చిరంజీవి కూడా ఈ సినిమా కథను విన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే టైగర్ నాగేశ్వరరావు కథ నచ్చినా వేర్వేరు కారణాల వల్ల టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ సినిమాను రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో క్రాక్ మినహా మరే హిట్ లేని రవితేజకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో కోరుకున్న సక్సెస్ దక్కుతుందెమో చూడాల్సి ఉంది.ఇకపోతే రవితేజ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.అయితే  సినిమాసినిమాకు రవితేజకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటు ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఇక  రవితేజ ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: