క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఇటీవల తెగ వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా ఈవిడగారు సోషల్ మీడియాలో చేసే రచ్చ పీక్స్‌లో ఉంటుంది.
కూతురితో కలిసి లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా. ఇదిలా ఉంటే.. సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేఖా వాణి భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయారు.ఇక ఆ తర్వాత ఈమె రెండో పెళ్లి వార్తలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ వచ్చాయి. అయితే సురేఖా మాత్రం ఇంతవరకు ఎవర్నీ రెండో వివాహం చేసుకోలేదు. కూతురు సుప్రీతతోనే కలిసి సింగిల్‌గానే ఉంటుంది.
తాజాగా ఓ పార్టీలో సురేఖా వాణి రాజా రవీంద్ర మీద మీద పడుతూ నానా రచ్చ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. నటుడు రాజా రవీంద్ర, సురేఖా వాణి, నటి రజిత, హేమ ఇలా అందరూ కూడా ఓ గ్యాంగులా కలిసి మెలిసి ఉంటారు. ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కలుస్తుంటారు. ఇక మధ్య మధ్యలో వీకెండ్ పార్టీలంటూ నానా హంగామా చేస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే సురేఖా వాణి ఎక్కువగా ట్రెండ్ అవుతుంటుంది. యూట్యూబ్ వంటి వాటిల్లో రాజా రవీంద్ర ట్రెండ్ అవుతుంటారు.
పలు స్టార్ హీరోలకు మేనేజర్‌గా ఉంటూనే తనకు సూట్ అయ్యే పాత్రలతో వెండితెరపై ఆకట్టుకుంటూ ఉంటాడు. రీసెంట్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత ఇంట్లో బర్త్‌డే పార్టీ జరిగింది. ఈ బర్త్‌డే పార్టీలో సురేఖా వాణి, సన, హేమ.. తదితర తోటి నటీనటులతో నటి రజిత తెగ సందడిగా కనిపించారు. కేక్ కటింగ్ సమయంలో సురేఖా వాణి, రాజా రవీంద్రతో మెడపై చేతులు వేసి, బోలెడంత సందడి చేసింది. ఇది చూసిన నెటిజన్లు సురేఖా వాణిని ట్రోల్ చేస్తున్నారు. ఎవరెన్ని ఎన్ని మాటలు అన్నా కూడా సురేఖా వాణి తనదైన శైలిలో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: