టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రభాస్ శీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు ఎంతోమంది కమెడియన్స్ ఉన్నా తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉంది అని నిరూపించుకున్నాడు ప్రభాస్ శ్రీను. అయితే ప్రభాస్ శ్రీను అటు రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎంతో సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే.  అయితే ఎప్పుడు వీరిద్దరూ కలిసే ఉండేవారు. కానీ గత కొంతకాలం నుంచి వీరి మధ్య గ్యాప్ వచ్చినట్లు కనిపించింది.


 వీరి మధ్య గొడవలు రావడం వల్ల దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవలే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణం సమయంలో ప్రభాస్ శ్రీను అటు రెబల్ స్టార్ ప్రభాస్ వెంటే ఉంటూ అన్ని పనులలో తోడుగా నిలబడి ధైర్యం చెప్పాడు. కాగా తమ మధ్య గొడవలు జరిగాయి అంటూ వస్తున్న వార్తలపై ఒక ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ శ్రీను పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ కు తనకు మధ్య ఎటువంటి గొడవలు లేవని మేమిద్దరం ఎప్పటిలాగానే ఎంతో స్నేహంగా ఉంటున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మా ఇద్దరి మధ్య మాటలు లేవు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు అంటూ చెప్పాడు. అంతేకాదు ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు ప్రభాస్ శ్రీను. రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి గొప్ప వ్యక్తితో గొడవపడి దూరం కావాలనే ఎవరు కోరుకోరు అంటూ చెప్పుకొచ్చాడు. వైజాగ్ లో సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకునే సమయం నుంచి ఇప్పటివరకు కూడా మేమిద్దరం మంచి స్నేహితులుగానే మెలుగుతున్నాం అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. ఇక మా ఇద్దరి మధ్య స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతోంది అంటూ ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: