భారతదేశంలోనే అద్భుతమైన దర్శకుడుగా గొప్ప పేరును సంపాదించుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో గొప్ప గొప్ప మూవీ లకు దర్శకత్వ వహించి వైవిధ్యమైన దర్శకుడుగా దేశ వ్యాప్తంగా తన కంటూ మణిరత్నం దర్శకుడు గా ఒక గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మణిరత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి ,  ఐశ్వర్యా రాయ్ ,  త్రిష ,  ఐశ్వర్య లక్ష్మి ,  ప్రకాష్ రాజ్ వంటి నటులు నటించారు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ఈ నెల సెప్టెంబర్ 30 వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో నటించిన నటీనటులకు సంబంధించిన రెమ్యూనరేషన్ లు ఇవే అంటూ ఒక వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వార్త ప్రకారం పొన్నియన్ సెల్వన్ మూవీ కోసం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించిన నటీనటుల రెమ్యూనిరేషన్ ఏమిటో తెలుసుకుందాం ...  ఈ మూవీ కోసం చియన్ విక్రమ్ అత్యధికంగా రెమ్యూనిరేషన్ తీసుకున్న నటుడి గా తెలుస్తుంది. చియాన్ విక్రమ్మూవీ కోసం 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ,  ఐశ్వర్య రాయ్ మూవీ కోసం 10 కోట్లు ,  జయం రవి ఈ మూవీ కోసం 8 కోట్లు ,  కార్తీ ఈ మూవీ కోసం 5 కోట్లు ,  త్రిష ఈ మూవీ కోసం 2 కోట్లు ,  ఐశ్వర్య లక్ష్మి మరియు ప్రకాష్ రాజ్ లు ఈ మూవీ కోసం చెరో కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ దాదాపు 500 కోట్లతో తరికెక్కినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: