మూవీ ప్రమోషన్ కోసం తమన్నా టూ మచ్ ఎక్స్ ఫోజింగ్ తో వార్తల్లో ఎక్కింది. యద అందాలు కనిపించేలా క్లివేజ్ షోతో సోషల్ మీడియాను ఒక సరిగా షేక్ చేసింది.


గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ కలిగిన ట్రెండీ వేర్ లో తెగించి అందాల ప్రదర్శన చేసింది.

 
తమన్నా లేటెస్ట్ మూవీ ప్లాన్ ఏ ప్లాన్ బి. సెప్టెంబర్ 30 నుండి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. సదరు డ్రెస్ లో ఫోటో షూట్ చేసిన తమన్నా సూపర్ సెక్సీ ఫోజులతో రెచ్చగొట్టే యత్నం చేసింది

 
ఈ మధ్య తమన్నా వరుసగా ఓటీటీలో చిత్రాలు విడుదల చేస్తున్నారు. వారం వ్యవధిలో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి విడుదలయ్యాయి. ఫేడ్ అవుట్ దశలో అందివచ్చిన సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. కోట్లు సంపాదిస్తూ ఆర్థికంగా మరింత నిలదొక్కుకుంటున్నారు.

 
దశాబ్దన్నర కాలంగా తమన్నా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఉన్నారు. రెండు తరాల స్టార్స్ ని ఆమె కవర్ చేశారు. శ్రీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు హ్యాపీ డేస్, 100% లవ్ లాంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి. ఆమెకు మంచి ఫేమ్ స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.

 
స్టార్ అయ్యాక తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు.ఆమెతో పాటు వెండితెరకు పరిచయమైన హీరోయిన్స్ ఫేడ్ అవుటై వెళ్లిపోయారు. తమన్నా మాత్రం ఇప్పటికీ తన గ్లామర్ పవర్ చూపిస్తుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు.

 
భోళా శంకర్ మూవీలో చిరంజీవికి జంటగా మరోసారి జత కడుతున్నారు తమన్నా. గతంలో ఆమె సైరా నరసింహారెడ్డి మూవీలో చిరంజీవి రహస్య ప్రేయసి పాత్ర చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్ర దర్శకుడు. వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేస్తున్నారు.

 
ఇక తన కెరీర్ రేసు గుర్రంలా దూసుకుపోతుండగా తమన్నా సోషల్ మీడియాను కూడా వదలడం లేదు. వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ బాగ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: