మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కొత్త రికార్డులు క్రియేట్ కావాల్సిందేననే విషయం తెలిసిందే.


ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారట.


త్రివిక్రమ్ తర్వాత హీరోల జాబితాలో తారక్, చరణ్, ప్రభాస్, చిరంజీవి, అల్లు అర్జున్ ఉన్నారట.. ఈ ప్రాజెక్ట్ లలో ఏది మొదట మొదలవుతుందో చెప్పలేం కానీ స్టార్ హీరోలతో త్రివిక్రమ్ వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు త్రివిక్రమ్ 30 నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ హీరోల జాబితా గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు. త్రివిక్రమ్ తన దగ్గర ఉన్న కథలకు అనుగుణంగా హీరోలను ఎంపిక చేసుకుంటున్నారట..


 


మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి 300 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. త్రివిక్రమ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు హాలీవుడ్ లెవెల్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ప్రాజెక్ట్ లపై త్రివిక్రమ్ దృష్టి పెట్టనున్నార ని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట.. కుటుంబ కథా చిత్రాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దర్శకుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి.


 


త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాల పై దృష్టి పెడితే ఆయన రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. వేగంగా ప్రాజెక్ట్ లు చేయడం కంటే ప్రతి సినిమా సక్సెస్ సాధించే లా త్రివిక్రమ్ శ్రీనివాస్ జాగ్రత్త లు తీసుకుంటున్నారట.. త్రివిక్రమ్ సినిమాలలోని డైలాగ్స్ నచ్చి చాలామంది ఆయనకు అభిమానులు గా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: