ప్రముఖ నిర్మాత బి సురేష్ బాబు రెండవ కుమారుడు అభిరామ్ దగ్గుపాటి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అహింసా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విభిన్నమైన కథ నేపథ్యంతో తేరకెకిస్తూ ఉన్నారు. ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా డైరెక్టర్ తేజ తెరకెక్కించారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది దీంతో ఈ సినిమా ప్రమోషన్ పనులు కూడా మొదలుపెట్టారు చిత్ర బృందం. ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ లభించింది ఈ క్రమంలోని తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్ర బృందం విడుదల చేశారు.


అహింసా సిద్ధాంతాన్ని అనుసరించిన వ్యక్తి హింస కలిగినప్పుడు ఏం చేస్తారు అన్న కథ అంశంతో డైరెక్టర్ తేజ ఈ సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో అభిరామ్ రఘు పాత్రలో కనిపించనున్నారు. పూర్తిగా అహింసకు వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే అనుకోని సంఘటనలతో అతని జీవితం ఒక మలుపు తిరుగుతుంది. ఇలా ఒక బలమైన పాయింట్ తో డైరెక్టర్ తేజ ఒక అందమైన ప్రేమ కథ తీసుకు వస్తున్నారని ఈ టీజర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది.

ఇందులో రఘు,అహల్య వంటి ఇద్దరు అమాయకుల ప్రేమ కథ చిత్రం గా తెరకెక్కించారు.ఇందులో అభిరామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా హీరోయిన్ గీతిక అహల్యగా కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సదా కూడా నటిస్తున్నది ఆర్పి పట్నాయక్ తన ఆహ్లాదకరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. మొత్తం మీద డైరెక్టర్ తేజ మార్కే సినిమాని బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే విషయంపై చిత్ర బృందం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: