టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే భారీగా క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు.
స్టార్ హీరో రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో పూర్తిగా మాస్ హీరోగా మారిపోయాడు. ఇకపోతే విజయ్ దేవరకొండ ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు విజయ్.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా విజయ్ ఆశలపై ఇటు అభిమానులు ఆశలపై నీరు చల్లింది. అయితే ఈ సినిమా విడుదల అవ్వక ముందు సినిమా హిట్ అవుతుంది అని నమ్మకంతో మాట్లాడిన వీరు సినిమా విడుదల తర్వాత దర్శక నిర్మాతలు అలాగే హీరో సోషల్ మీడియాలో కనిపించడమే మానేశారు. అంతేకాకుండా దారుణంగా ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొన్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌లో అయితే లైగర్‌ సినిమాపై బాయ్‌కాట్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ కూడా అయ్యింది.

ఇక విజయ్ దేవరకొండ పై ప్రమోషన్స్ సమయంలో విమర్శలు వెల్లువెత్తినా కూడా కొద్దిగా పట్టించుకోలేదు. యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంటూ అతని పై పలువురు విమర్శలు గుప్పించారు. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు కన్నతల్లి అయినా ఇందిరా దేవి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇందిరా దేవిని కడసారి చూడడం కోసం భారీగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా తరలివచ్చారు. ఇందిరా దేవి పార్థివ దేహానికి నివాళులు అర్పించి అనంతరం మహేష్ బాబును ఓదార్చారు.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కూడా ఇంద్ర దేవి పార్తివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం మహేష్ బాబు ని ఓదార్చి, పక్కనే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ ని సైతం పలకరించారు. కాగా అక్కడ విజయ్‌ దేవరకొండ ప్రవర్తించిన తీరు అందరినీ కట్టిపడేస్తోంది. కృష్ణ సోఫాలో కూర్చొని బాధపడుతుండగా విజయ్‌ వెళ్లి ఆయన కాళ్ల దగ్గర కూర్చొని చేయి పట్టుకొని ఓదార్చిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇతనికా యాటిట్యూడ్‌ అని అందరు ట్రోల్‌ చేస్తున్నారు అంటూ ఆ ఫొటోని షేర్‌ చేస్తున్నారు. ఇదిరా మా అన్న అంటూ విజయ్‌ ఫ్యాన్స్‌ అయితే తెగ సంబరపడిపోతున్నారు విజయ్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: