జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అని ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు చిత్ర బృందం.
కానీ ఈ సినిమా పైన మాత్రం పలు గాసిప్స్, రూమర్స్ మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇక కొరటాల శివ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పైన కాస్త నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతోందని చెప్పవచ్చు. చివరిగా ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివకు కోలుకోలేని దెబ్బ పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఎన్టీఆర్ కొరటాల శివకు అవకాశం ఇచ్చారని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమా ఎక్కువగా ఆలస్యం అవుతూనే ఉన్నది.. కథ అంతగా కనెక్ట్ కాక పోయి ఉండొచ్చని అందుచేతనే కథలో మార్పులు చేసి ఈ కథకు అభిమానులు కూడా సంతృప్తి పడేలా ఉండాలని ఎన్టీఆర్ సూచించడంతో ఈ కథలో మార్పులు చేసి ఉండవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్ విషయంలో ఈ సినిమా పైన కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అందుచేతనే ఈ సినిమాలో దాదాపుగా హీరోయిన్ ఫిక్స్ అయిందన్నట్లుగా ఒక వార్త వైరల్ గా మారుతోంది.
ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తను నటించిన ధాంక్ గాడ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా పైన చాలా ఎక్సైటింగ్ గా ఉన్నట్లుగా తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రంపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కామెంట్స్ పై స్పందించింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది. ఇక దీంతో హీరోయిన్ ఫిక్స్ అయిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే టెక్నీషియన్స్ క్యాస్టింగ్ విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అన్ని విషయాలను అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: