బింబిసార సినిమా డిజిటల్ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లో దీపావళి కానుకగా..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా దర్శకుడు వశిష్ఠ మల్లిడి తెరకెక్కించిన చిత్రం ‘బింబిసార’. త్రిగర్తలను పరిపాలించిన రాజైన బింబిసారుడు చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరుగుతుందట.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా ఆగష్టు 5వ తేదీన విడుదలై.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన బింబిసార బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం కాకుండా.. సుమారు రూ. 75 కోట్ల కలెక్షన్లు రాబట్టిందట.ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డబుల్ రోల్‌లో కనిపించడం విశేషం. అలాగే హిట్స్ లేని కళ్యాణ్ రామ్‌కు ఈ మూవీ మంచి విజయాన్ని అందించింది. ఇప్పటికే థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో బింబిసార మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ కీలక ప్రకటన వచ్చేసింది.



బింబిసార సినిమా డిజిటల్ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి కానుకగా అక్టోబర్ 21 నుంచి బింబిసార మూవీ జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుందట.. వీకెండ్, ఆపై దీపావళి పండుగ కలిసి రావడంతో ఓటీటీలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన వ్యూస్ లభించే అవకాశం ఉంది. బింబిసార చిత్రం లో కేథరిన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లు‌ కాగా.. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారట.ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణీ సంగీతాన్ని అందించారు. అటు ‘బింబిసార’ హిట్ కావడం తో.. ఇప్పుడు ‘బింబిసార-2’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొందని తెలుస్తుంది.మరి ఈ సీక్వల్ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: