మొదటి రోజు ఈ సినిమాకి నెల్లూరు వంటి ప్రాంతాల నుండి షేర్స్ రావడమే కరువు అయిపోయింది..నెల్లూరు లో కేవలం 5 లక్షల రూపాయిల షేర్ తో మొదటి రోజు ని ప్రారంభించింది అంటే అక్కినేని ఫామిలీ కి ఇది చాలా అవమానకరం..ఇక రెండవ రోజు కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలలో నిన్న గాడ్ ఫాదర్ సినిమాకి టికెట్స్ దొరకని వాళ్ళు ఘోస్ట్ కి వెళ్లారు..ఆలా కొన్ని ప్రాంతాల వరుకు ఈ సినిమా రెండవ రోజు నెట్టుకొచ్చిన చాలా ప్రాంతాలలో కనీసం స్థాయి గ్రాస్ వసూళ్లను కూడా సాధించలేకపోయింది.
మొత్తం మీద ఈ సినిమాకి రెండవ రోజు 65 నుండి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..మొత్తం మీద రెండు రోజులకు కలిపి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా ఈ సినిమా ఇంకా రాబట్టలేకపోయింది..ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 22 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యాలి..అది అసాధ్యం అని మనకి ఇప్పటికే అర్థం అయిపోయింది..డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమా కనీసం 16 కోట్ల రూపాయిలు నష్టాల్ని మిగిలించేలా ఉందని మనం ఊహించ వచ్చు.