బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఎవరు ఎవరికైనా దగ్గర కావచ్చు. కాగా మ్యారీడ్ రేవంత్ సింగిల్ వాసంతికి దగ్గరవుతున్నాడా అనేది ఒక ప్రశ్న.

ఆమె పట్ల ఆకర్షితుడు అవుతున్నాడా?. ఈ ఆదివారం కంటెస్టెంట్ గీతూ మాటలతో ఈ వాదన తెరపైకి వచ్చింది మరి, వాసంతిని రేవంత్ ఇష్టపడుతున్నట్లు చెప్పి గీతూ పెద్దా బాంబ్ పేల్చింది. ఆదివారం ఎపిసోడ్ లో ఇది చోటు చేసుకుంది. ఎలిమినేషన్ ప్రక్రియలో మెరీనా, అర్జున్, ఇనయా, చంటి మిగిలారు. స్టోర్ రూమ్ లో ఉన్న లాలిపాప్స్ తేవాలని నాగార్జున కెప్టెన్ రేవంత్ ని ఆదేశించాడు. రేవంత్ ఎవరి పేరు రాసున్న లాలీపాప్ వాళ్లకు ఇచ్చేశాడు.


లాలీపాప్ రాపర్ ఓపెన్ చేయాలని, గ్రీన్ కలర్ లాలీపాప్ ఉంటే సేవ్, రెడ్ ఉంటే అన్ సేఫ్ అని నాగార్జున గారు చెప్పాడు. మెరీనాకు గ్రీన్ కలర్ లాలీపాప్ రావడంతో ఆమె గేమ్ నుండి సేవ్ అయ్యారు. అర్జున్, ఇనయా, చంటి డేంజర్ జోన్లో మిగిలారు. అనంతరం ఆ నాలుగు లాలీపాప్స్ స్టోర్ రూమ్ లో పెట్టాలని రేవంత్ కి నాగార్జున గారు చెప్పారు, అయితే లాలీపాప్స్ మాకు కావాలని కంటెస్టెంట్స్ అడిగారు. ముఖ్యంగా గీతూ రేవంత్ చేతిలోంచి లాక్కునే ప్రయత్నం కూడా చేసింది. వారించిన నాగార్జున హౌస్ గురించి ఒక సీక్రెట్ చేప్తే తీసుకోవచ్చు అన్నాడు.

ఇక లాలీపాప్ కోసం గీతూ చెప్పిన సీక్రెట్  అందరినీ మైండ్ బ్లాక్ చేసింది. రేవంత్ లేడీ కంటెస్టెంట్ వాసంతి పట్ల సాఫ్ట్ గా ఉంటున్నాడు. ఆమె అంటే తనకు ఇష్టమనిపిస్తుందని చెప్పింది. ఆమె తప్పు చేస్తే కేవలం దిండ్లు సర్దమని చిన్న చిన్న పనులు మాత్రమే చెప్పుతున్నాడు . వాసంతి అంటే రేవంత్ కి ఇష్టమని చెప్పి  పెద్దా షాక్ ఇచ్చింది. పెళ్ళైన రేవంత్ కి ఎఫైర్ అంటగట్టడం సంచలనంగా మారింది. సింగిల్స్ మధ్య ఇలాంటివి కామనే. కంటెస్టెంట్స్ ఈ రూమర్స్ సీరియస్ గా తీసుకోరు.

వాసంతి సింగిల్ అయినప్పటికీ రేవంత్ మ్యారీడ్. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ఈ క్రమంలో గీతూ ఆరోపణ ప్రాధాన్యత సంతరించుకుంది. బయట నుండి చూస్తున్న రేవంత్ భార్యను ఇలాంటి కామెంట్స్ హర్ట్ చేయడం ఖాయం అంటున్న ప్రేక్షకులు, రేవంత్-వాసంతిల మధ్య నిజంగా ఏముందో తెలియదు కానీ.. గీతూ మాత్రం చిచ్చు పెట్టింది. అందరికీ తెలిసిన విషయం మాత్రం అర్జున్ పట్ల వాసంతి ఇంట్రెస్ట్ గా ఉంది. అలాగే ఇనయా కంటెస్టెంట్ సూర్య పట్ల తన ఇష్టం కన్ఫర్మ్ చేసింది. అతన్ని హగ్గులతో ముంచేస్తుంది. ఈ సీజన్ కి సూర్య-ఇనయా లవ్ బర్డ్స్ గా అవతరించారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: