తొలి సినిమాతో భారీ విజయాన్ని అందుకుని 100 కోట్ల హీరోగా మారిపోయిన వైష్ణవ తేజ్ ఆ తర్వాత ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయడంలో విఫలం అయ్యాడు. రెండవ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొండ పొలం ఏ మాత్రం ప్రేక్షకులను అలరించకపోవడంతో ఆయన మంచి విజయం అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మూడవ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడడంతో ఒక్కసారిగా ఈ హీరో డిప్రెషన్ కు వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగా రంగా వైభవంగా సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. అసలు సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో అన్న ట్లుగా ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న సినిమా అయినా తనకు మంచి విజయం తెచ్చి పెట్టాలని భావిస్తున్నాడు. వైష్ణవ తేజ్.  ఈ చిత్రంలో శ్రీ లీలా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తప్పకుండా తనకు భారీ విజయాన్ని తెచ్చిపెడుతుంది. మంచి కం బ్యాక్ ఇస్తుందని ఆయన నమ్మకంతో ఉన్నాడు. అయితే విజయం రాగానే పొంగిపోవడం ప్లాప్ రాగానే కృంగిపోవడం వంటివి చేయడం వల్లనే వైష్ణవ తేజ్ ఇలాంటి డిప్రెషన్ లో ఉన్నాడని చెప్పవచ్చు.

 ఎందుకంటే మొన్న జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ కి కూడా ఆయన రాకపోవడం ఏ విధమైన డిప్రెషన్ లో ఉన్నాడో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఒక కేటగిరీలో ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు రాగా దానికి ఆహ్వానించిన అవార్డు సంస్థ దానిని నిరాకరించడం నిజంగా ఆయన అభిమానులను కలచివేస్తుంది అని చెప్పాలి. ఫ్లాప్ వచ్చినప్పుడు కుంగిపోయి హిట్టు వచ్చినప్పుడు పొంగిపోవడం తగదు అని ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు చెబుతున్నారట. ఇప్పటికైనా అలాంటి డిప్రెషన్ కి వెళ్లడం ఆయన కెరియర్ కు ఏ మాత్రం మంచిది కాదని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: