ఇప్పటికే గతంలో సూపర్ హిట్ సాధించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయి మరోసారి ప్రేక్షకులను అలరించి మంచి కలెక్షన్లు కూడా సాధించాయి. ఇక త్వరలో ప్రభాస్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో ప్రభాస్ కెరియర్ లో హిట్ సినిమాలుగా ఉన్న బిల్లా, వర్షం సినిమాలు కూడా 4k ప్రింట్లతో రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా కూడా రిలీస్కు సిద్ధమవుతుంది అన్నది తెలుస్తుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అని చెప్పాలి.
ఇక ఆయన కామెడీ టైమింగ్ కి ఆయన సినిమాలకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.. అయితే జనవరి 26వ తేదీన మాస్ మహారాజ రవితేజ బర్త్ డే అన్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన విక్రమార్కుడు సినిమాని 4k ప్రింట్ తో రీ రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే 4కే ప్రింట్ కు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించాడు. ఈ సినిమాలో ద్విపత్రాభినయం చేసిన రవితేజ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక విక్రమార్కుడు సినిమా రీ రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి