టాలీవుడ్ లో మంచి మాస్ ఇమేజ్ తోనే బాల కృష్ణ ఊహించిన విధంగా సక్సెస్ అందుకోవడం విశేషం. అఖండ సినిమాతో ఆయన సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. జై బాలయ్య అనే నినాదం ఇప్పుడున్న టీనేజ్ పిల్లల్లో కూడా బాగా వైరల్ అయిపోయింది.అందువల్ల ఇక తదుపరి సినిమాకు మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది. యంగ్ డైరెక్టర్  గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణ 107వ సినిమాలు మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.ఈ సినిమాలో బాలయ్య బాబు విలన్స్ ను ఊచకోత కోస్తూ పవర్ఫుల్ డైలాగ్స్ కూడా చెప్పబోతున్నాడు. అయితే బాలయ్య బాబు అంటే కేవలం డైలాగ్స్ యాక్షన్ మాత్రమే కాదు డాన్స్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. ఇక గోపీచంద్ మలినేని ఆ విషయంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నాడట.


సంగీత దర్శకుడు తమన్ తో అలాగే డాన్స్ కొరియోగ్రాఫర్స్ తో ముందుగానే మాట్లాడి ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు ఒక డ్యూయెట్ అలాగే మరో మాస్ సాంగ్ కూడా డిఫరెంట్ గా ఉండాలి అని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక రీసెంట్ గా బాలయ్య బాబుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుగుణసుందరి అనే సినిమాలోని ఒక పాటకు ఆయన అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫారిన్ లోకేషన్లో అందమైన ప్రదేశంలో ఉరమాస్ స్టెప్పులు వేస్తూ బాలయ్య ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇక సాంగ్ వింటూ ఉంటే రామ్ మిర్యాల పాడినట్లు అనిపిస్తోంది. చూస్తూ ఉంటే ఈ సినిమాలో వింటేజ్ బాలయ్య స్టెప్పులు కూడా హైలెట్ కాబోతున్నట్లు అర్థమవుతుంది. కాగా ఈ సినిమాకి రెడ్డి గారు అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం తెలుస్తుంది. మరి అదెంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: