ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం గ్లామర్ ఉన్న వాళ్ల వైపే మొగ్గు చూపుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న వాళ్ళను మాత్రమే సినీ ఇండస్ట్రీ వాళ్ళు బాగా ఆదరిస్తున్నారు
ఎందుకంటే వాళ్ళు ఉన్నది కేవలం వాళ్ళ అందాన్ని ఎక్స్పోజింగ్ చేయడం కోసమే అన్నట్లుగా ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోయాయి. ఆమె ఎంత పెద్ద హీరోయినైనా కావచ్చు. కానీ ఆమె రేంజ్ కేవలం అందాలను చూపించే వరకే పరిమితం చేస్తున్నారట దర్శక నిర్మాతలు. అంతే కాకుండా ఇలా సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేస్తున్న వారికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ఇదే జాబితాలోకి తాజాగా నిధి అగర్వాల్ కూడా చేరింది.
హీరోయిన్ మొదటి నుండి ఈ కూడా గ్లామర్ పరంగానే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఈమె ముందుగా బాలీవుడ్లో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టి అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇండస్ట్రీలోకి రావడంతోనే ఒక భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా అయినా హరిహర వీరమల్లు లో హీరోయిన్ గా చేస్తుందట.. ఇక ఈ సినిమా పై ఇప్పటికే చాలా మంది భారీ అంచనాలు పెట్టుకున్నారు.నిధి అగర్వాల్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువగా వస్తున్నప్పటికీ,కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం పెద్ద పెద్ద ఆఫర్లు అయితే వస్తున్నాయి.
ఇక ఇదే విషయంలో తాజాగా నిధి అగర్వాల్ స్పందిస్తూ తనకు ఆఫర్లు రావడానికి ప్రధాన కారణం ఏంటో చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. నాకు ఆఫర్లు రావడానికి ముఖ్య కారణం అందం. సినిమా పరిశ్రమలో ఎక్కడైనా టాలెంట్ ను చూసి అవకాశం ఇస్తారంటే నేను అస్సలు నమ్మను.ఎందుకంటే మన అందాలను చూసే వాళ్ళు మనకు అవకాశాలు ఇస్తారు. మనం ఎంత ఎక్స్ పోజింగ్ చేసి,ఎంత అందంగా ఉంటే అంతమంచి ఛాన్స్ లు ఇస్తారని నాకు కూడా నా అందం కారణంగానే అవకాశాలు వస్తున్నాయి. నాకు ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా అది కేవలం నా అందాన్ని చూసే ఇస్తున్నారని నాకు తెలుసు అంటూ నిధి అగర్వాల్ ఆ ఇంటర్వ్యూ లో షాకింగ్ కామెంట్స్ చేసిందట. అయితే నిధి అగర్వాల్ ఇలా పచ్చిగా మాట్లాడుతుందని ఎవరు ఊహించి ఉండరేమో మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి