అల్లుఅర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప..డిసెంబర్ 17 న పాన్ ఇండియా మూవిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా ఎంతటి ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.రష్మిక మందన్నా హీరోయిన్ నటించిన ఈ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో మలయాళీ స్టార్ ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటించారు. ఇక ఇప్పుడు ఈ కు సిక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. పార్ట్ 1 కంటే పార్ట్ 2 పై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సెకండ్ పార్ట్ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి భాగం సక్సెస్ అవ్వడంతో అభిమానుల్లో నెలకొన్ని బజ్ ని దృష్టిలో పెట్టుకునే రెండవ పార్ట్ కో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు సుకుమార్.


ఈ క్రమంలోనే ఊహించని ట్విస్ట్ లు ఈ సినిమాలో ఉన్నడనున్నాయని తెలుస్తోంది. కాగా ఈ సినిమా లో విలన్ గా ఫహిద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. అయితే రెండో పార్ట్ లో ఆయనను మరింత క్రూరంగా చూపించనున్నాడట సుకుమార్. అలాగే ఈ పార్ట్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా నటించనున్నాడని అంటున్నారు. అయితే ఇప్పుడు అర్జున్ కపూర్ పేరు వినిపిస్తోంది. మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రమ్లో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ఇప్పటికే అతడితో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.


ఇందులో మరో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని.. అయితే ఈ రోల్ కోసం ముందుగా విజయ్ సేతుపతిని అనుకున్నారని.. ఇక చివరి నిమిషంలో అర్జు్న్ కపూర్‏ను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. దీపావళి పండగ తర్వాత నుంచి పుష్ప 2 షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. పండగ తర్వాత గ్యాప్ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. త్వరలోనే దీనిపై అప్డేట్ రానుంది. పాన్ ఇండియాని మించి పాన్ వరల్డ్ లకి రీచ్ అయ్యేలా కథగా దీనిని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్.మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: