ఈ మధ్యకాలంలో వరుసగా మల్టీ స్టార్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక సరైన కథతో వస్తే కచ్చితంగా స్టార్ హీరోల సినిమాలలో నటించడానికి నటీనటులు కూడా ముందుకు వస్తున్నారు. అయితే కథకు న్యాయం చేయగలిగే దర్శకులు దొరికితేనే ఇలాంటి రిస్క్ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ ఎక్కువ స్థాయిలో ఈ ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్ సినిమాలు రాలేదని చెప్పవచ్చు. ఇటీవల ఆచార్య సినిమా విడుదలవ్వగా అది భారీ డిజాస్టర్ ని చూసింది. ఇక ఆ తరువాత మల్టీ స్టార్లర్ సినిమాలు ఊసే ఎత్తలేదు మెగా హీరోలు.


అయితే చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేస్తే చూడాలని ఎప్పటినుంచో అభిమానులు సైతం కోరికగా కోరుకుంటూ ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఒకసారి వెండితెరపై కనిపిస్తే చాలు ఎలాంటి ప్రభంజనం ఉంటుందా మనం ఊహించలేము. గతంలో కూడా శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ లో వచ్చి అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఇక గతంలో డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వీరిద్దరు మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నట్లు అందుకోసం త్రివిక్రమ్ కూడా కథ సిద్ధం చేసినట్లుగా కూడా వార్తలు వినిపించాయి.


కానీ ఈ సినిమాని త్రివిక్రమ్ ఎందుకో కాంబినేషన్ సెట్ కాదని పెద్దగా పట్టించుకోలేదట. ఇక రీసెంట్గా గాడ్ ఫాదర్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సల్మాన్ ఖాన్ పాత్రలో కనిపిస్తే బాగుంటుంది అని అందరూ అనుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన కూడా అదే స్థాయిలో ఉండేది అని చిత్ర బృందం ఇటీవల క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ తో మల్టీస్ సినిమాపై చిరంజీవి మాట్లాడుతూ మా తమ్ముడితో సినిమా చేయాలని సరదా నాకు కూడా ఉంది.. తను కూడా అదే ఫీలింగ్ తో ఉన్నారు అని కుదిరితే రాబోయే రోజుల్లో కచ్చితంగా సినిమా చేస్తామని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: