నేచురల్ స్టార్ నాని తో 'నిన్ను కోరి' సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ శివ నిర్వాణ. ఈయన డైరెక్షన్‌లో ప్రస్తుతం తెరకెక్కుతోన్న చిత్రం పేరు 'ఖుషీ'.


విజయ్ దేవరకొండ హీరో గా, సమంత హీరోయిన్‌గా రూపొందుతోంద ట ఈ సినిమా.


శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇటీవ ల కాస్త గ్యాప్ అయితే తీసుకుంది. అందుకు సమంత అందుబాటులో లేకపోవడమే కారణమనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు 'లైగర్' ఫెయిల్యూర్‌తో విజయ్ దేవరకొండ కూడా కాస్త డిప్రెషన్‌లో వున్న విషయం తెలిసిందే.




కారణం ఏదైతేనేం, కొద్దిగా దొరికిన ఈ టైమ్‌ని కథలు వినడానికి యూజ్ చేసుకుంటున్నాడట రౌడీ. ఆ క్రమంలోనే నాని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఓ కథను కూడా వినిపించాడట. విజయ్‌కి ఆ స్టోరీ తెగ నచ్చేసిందట. కలిసి పని చేద్దాం అని హామీ కూడా ఇచ్చాడట. 'గాడ్ ఫాదర్' ప్రొడ్యూసర్ ఎన్‌.వి.ప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ముందు కొచ్చారనీ సమాచారం.


అన్నీ కుదిరితే, వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కట్ చేస్తే, ఈ డైరెక్టర్ ఎవరో కాదు, నానికి 'జెర్సీ'తో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన 'జెర్సీ' మాదిరి ఇది కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వుండే స్టోరీ అని చూజాయగా తెలుస్తోంది.


సో, ఆ నమ్మకంతోనే విజయ్ కూడా ఈ డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టేసి వుండొచ్చు. చూస్తుంటే, నాని డైరెక్టర్లందరినీ వరుసగా విజయ్ దేవరకొండ లైన్‌లో పెడుతున్నట్లు కనిపిస్తోంది. మరీ.ఇప్పటికే లైగర్ ప్లాప్ తో డీలా పడ్డ విజయ్ కి ఈ మూవీస్ హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ మూవీస్ కూడా ప్లాప్ అయితే విజయ్ పరిస్థితి దారుణంగా ఉంటుంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలు అన్ని కూడా ఖుషి సినిమా పైనే వున్నాయి. ఈ సినిమాతో నిరూపించుకోవాలని చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: