మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం ఖిలాడి , రామారావు అన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం క్రాక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించినప్పటికీ ,  సరైన విజయాన్ని మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకో లేక పోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మాస్ మహారాజా రవితేజ "ధమాకా" అనే మాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ,  త్రినాధరావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి మాస్ క్రాకర్ అనే పేరుతో ఒక వీడియోను అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన శ్రీ లీల ఒక వీడియో ద్వారా ధమాకా మూవీ నుండి మాస్ క్రాకర్ వీడియోను రేపు ఉదయం 10 గంటల 01 నిమిషానికి విడుదల చేయనున్నట్లు ఒక వీడియో ద్వారా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.   మరి ఈ మాస్ క్రాకర్ వీడియోకు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ లో రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇప్పటికే ధమాకా మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: