ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంతార సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి నటన పరంగా మెర్పించారని ప్రశంశాల వర్షం అందుకుంటున్నారు. ఎంతమంది సిని సెలబ్రిటీలు సైతం ఈ చిత్రాన్ని చూసి ప్రశంసలు వర్షం కురిపించారు. ఇక దీంతో పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యారు రిషబ్ శెట్టి. తాజాగా ఈ సినిమాని సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.


మనకు తెలిసిన విషయాలు కంటే తెలియని విషయాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి విషయాలను హోంభలే ఫిలిం ద్వారా కాంతారా సినిమా ద్వారా చూపించడం జరిగింది. కాంతారావు సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరి రోమాలు కూడా నిక్కబొడుచుకుంటాయి. ఒక రచయితగా zదర్శకుడిగా ,నటుడుగా రిషబ్ శెట్టి వ్యవహరించిన తీరికి హ్యాండ్సప్ తెలియజేశాడు రజనీకాంత్ . ఇండియన్ సినిమాలలో మాస్టర్ పీస్ లాంటి సినిమా అందించిన చిత్ర బృందానికి మొత్తానికి కంగ్రాట్యులేషన్స్ తెలియజేశారు రజనీకాంత్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో తెలియజేశారు.

ఈ విధంగా కాంతారా సినిమాపై రజనీకాంత్ ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమాకి మరింత హైప్ నెలకొంది అని చెప్పవచ్చు.రిషబ్ శెట్టి రిప్లై ఇస్తు.. రజనీకాంత్ సార్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మీరు.. నేను మీకు చిన్నప్పటి నుంచి అభిమానిని మీ ప్రశంశాలతో నా కల పూర్తిగా సహకారమైందని తెలియజేశారు. స్థానికంగా ఉండే కథలను సినిమాగా చేయాలని స్ఫూర్తితోనే మీ నుంచి లభించిందని తెలియజేశారు ఈ సందర్భంగా రజినీకాంత్ చేసిన ట్వీట్ కు రిషబ్ శెట్టి ఎమోషనల్ రిప్లై ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా చిన్న సినిమాగా మొదలైన కాంతారా సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: