సమంత ప్రధాన పాత్రలో నటించిన ఆసక్తికరమైన చిత్రం యశోద. నవంబర్ 11వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతుంది. విడాకుల తర్వాత ఆమె చేస్తున్న పలు ఆసక్తికర సినిమాలలో ఈ చిత్రం కూడా ఒకటి. ఆ విధంగా యశోద సినిమాపై ఇప్పుడు మంచి బజ్ ఏర్పడింది అని చెప్పాలి. తొలి చిత్రం నుంచి ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. దానికి కారణం ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా కావడమే. ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులను అలరించింది. ఆసక్తి పరిచింది.

ట్రైలర్ను చూసి చాలామంది ఈ సినిమా చూడాలని అభిప్రాయానికి వచ్చారని సోషల్ మీడియాలో కొంతమంది పెడుతున్న కామెంట్ల ద్వారా తెలుస్తుంది. ఇప్పటిదాకా తెలుగులో ఇలాంటి కథాంశం ఉన్న సినిమా రాలేదని చాలామంది చెబుతున్నారు. గతంలో హాలీవుడ్ లో మాత్రమే ఇలాంటి కథలను ఎక్కువగా ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు ప్రేక్షకులలో మారిన అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రానికి తప్పకుండా ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి ఆదరణ దక్కుతుంది అని చెప్పవచ్చు.

పీపుల్స్ మీడియా వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా కూడా విడుదల చేయడానికి చాలా సమయాన్ని తీసుకున్నారు. పలు విడుదల తేదీలను పరిశీలించిన తర్వాత చివరకు నవంబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఇటీవల వరుస సక్సెస్ లను అందుకుంటున్న ఈ సంస్థ ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. సమంత చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో ప్రేక్షకులకు మళ్లీ కనబడబోతుంది. ఈ నేపథ్యంలో మంచి కం బ్యాక్ చేయాలి అంటే ఈ సినిమా తప్పకుండా భారీ విజయం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా మాత్రమే కాకుండా ఆమె శాకుంతలం అనే మరొక సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: