ఇదిలా ఉంటే కేవలం ఇండస్ట్రీ లోకి వచ్చి నిలదొక్కుకోవాలి అనుకునే ఆప్కమింగ్ కమీడియన్స్ కి మాత్రమే కాదు అప్పటికే ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా హవా నడిపించి తర్వాత కాలంలో మాత్రం కొత్త కమెడియన్స్ రాకతో అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న వారికి సైతం లైఫ్ ఇస్తుంది జబర్దస్త్ కార్యక్రమం. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఇండస్ట్రీలో తాగుబోతు రమేష్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రమేష్ ఇప్పుడు జబర్దస్త్ లో కమెడియన్ కామెడీ పంచుతున్నాడు.
మరో టీం లీడర్తో కలిసి తాగుబోతు రమేష్ టీం ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో తాగుబోతు రమేష్ కి పారితోషకం చాలా తక్కువగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ కమెడియన్స్ లో చాలామందికి తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అయితే వారి కంటే తక్కువగా తాగుబోతు రమేష్ కి ఒక్కో ఎపిసోడ్కి 50 వేల వరకు మాత్రమే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడం.. ఇక జబర్దస్త్ లో చేయడం ద్వారా సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉండడంతో తక్కువ అయిన కూడా తాగుబోతు రమేష్ చేస్తున్నాడట. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. తమ అభిమాన కమీడియన్ కి కాస్త రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వాలి అంటూ మల్లెమాల యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి