విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవల ఎంతో అట్టహాసంగా మొదలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రేక్షకులను తన సినిమాలతో ఎంతగానో అలరిస్తున్న విశ్వక్ తొలిసారిగా భారీ స్థాయిలో పేరున్న దర్శకులతో సినిమా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అర్జున్ ఆయనతో సినిమా చేయడం ఎంతో విశేషం. ఇక అర్జున్ మొదటి నుంచి చెప్పుకొస్తున్నట్లుగానే ఈ సినిమా యొక్క కథ ఎంతో అద్భుతంగా ఉంటుంది అని అందరూ భావించారు. 

సినిమా చూడడం కోసం వారు ఎంతో ఆసక్తిగా కూడా ఎదురు చూశారు. అయితే ఇటీవల అర్జున్ నిర్వహించిన ఒక సంచలనాత్మక ప్రెస్ మీట్ ఈ సినిమా జరగదు అని చెబుతుంది. హీరో విశ్వక్ చిత్ర యూనిట్ ను ఇబ్బంది పెట్టడమే దీనికి కారణం అని ఆయన అన్నారు. పలుమార్లు షూటింగ్ ను వాయిదా వేయించేలా చేసిన హీరో విశ్వక్ ప్రవర్తన బాగుండకపోవడంతో అర్జున్సినిమా నుంచి అతనిని తీసేస్తున్నాను అని వెల్లడించాడు. ఏదేమైనా 45 సంవత్సరాలుగా అన్ని సినిమా పరిశ్రమలలోని ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన అర్జున్ కు ఇలాంటి పరిస్థితి ఎదురవడం నిజంగా ఆయనకు అవమానకరమని చెప్పాలి 

ఇది తనకు అవమానం అని భావించే అర్జున్ ఈ విధమైన ప్రెస్ మీట్ పెట్టడమే తెలుస్తుంది. దీనికి హీరో విశ్వక్ కూడా వివరణ ఇచ్చాడు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని కేవలం ఒకరోజు షూటింగ్ ను ఆపివేయమని మాత్రమే చెప్పానని ఆయన వెల్లడించారు. ఈ విధంగా ఈ హీరో ప్రతి సినిమాకు ఈ విధమైన వివాదాన్ని కోరి తెచ్చుకోవడం ఆయన కెరియర్ కు అంత మంచిది కాదని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. వరుస సినిమాలను చేస్తున్నా కూడా విజయాలను ఏమాత్రం అందుకోలేకపోతున్న విశ్వక్ ఇలాంటి వివాదాలు కోరి తెచ్చుకోవడం అంత మంచిది కాదని వారు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: