స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద మూవీ థియేటర్లలో ఈ నెల 11వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు కావడం తో నిర్మాత శివ లెంక కృష్ణప్రసాద్ తెగ టెన్షన్ పడుతున్నారు

పలు ఏరియాలలో సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం ఆయన టెన్షన్ కు కారణమ ని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ లెక్కలు చెబుతూ నిర్మాత సమంతకు చుక్కలు చూపిస్తున్నారట.

నడవలేని స్థితిలో ఉన్న సమంత ఇంటర్వ్యూ లు ఇవ్వడం వెనుక అసలు కారణం కూడా ఇదేనని బోగట్టా. అయితే నిర్మాత చేసిన కామెంట్ల కు సంబంధించి సమంత టీమ్ ఓవరాక్షన్ చేస్తుండటం విశేషం.యశోద మూవీ హక్కులు ఆ ఏరియాకు ఈ రేటుకు అమ్ముడయ్యాయ ని సమంత టీమ్ ప్రచారం చేస్తోంది. సినిమా బడ్జెట్ 25 కోట్ల రూపాయలు కూడా కాలేదని సమంత టీమ్ వెల్లడిస్తుండటం విశేషం.

నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయనే విధంగా సమంత ప్రచారం చేస్తుండటం కూడా హాట్ టాపిక్ గా మారింది.

యశోద సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఎలాంటి సమస్య లేదు. టాక్ అటూ ఇటూ అయితే మాత్రం సమంత కెరీర్ పై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంది. యశోద సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందో లేదో చూడాల్సి ఉందట.. ఈ సినిమా వేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.
సరోగసి నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కగా ఈ కాన్సెప్ట్ అందరికీ నచ్చే కాన్సెప్ట్ కాదట.. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే సమంత భవిష్యత్తు సినిమాలకు భారీగా బిజినెస్ జరగడంతో పాటు సమంతకు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందట.సామ్ ప్రాజెక్ట్ ల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా సామ్ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: