కన్నడలో తెరకెక్కిన ఒక సాధారణ చిత్రం "కాంతారా"... గత నెలలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్భుతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమా విడుదలై నెలరోజులు కావస్తున్నా ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి అంటే సినిమా ఎంత హిట్ అన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సింపుల్ కాన్సెప్ట్ ను యదార్థంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకుని పెద్దగా హంగామా లేకుండా మంచి స్క్రీన్ ప్లే తో తెరకెక్కించి హీరో మరియు దర్శకుడు రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని చివరి అరగంట క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇప్పటి వరకు కన్నడలో కెజిఎఫ్ సిరీస్ తరువాత మంచి పేరును తెచ్చుకున్న సినిమాగా ఖ్యాతిని తెచ్చుకుంది. ఈ సినిమా ప్రభావం వలన అటు టాలీవుడ్ , బాలీవుడ్ లో ఒక మోస్తరు కలెక్షన్ లు తెచ్చుకునే సినిమాలు కూడా కలెక్షన్ లు బాగా తగ్గిపోయి దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్ లతో ముందుకు వెళుతోంది. కాంతారా సినిమాకు సీక్వెల్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. కానీ దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అలా ఒక హీరోగా మరియు దర్శకుడిగా దేశం అంతటా రిషబ్ శెట్టి పేరు మారుమ్రోగిపోతోంది.

ఇప్పటికే అన్ని ఇండస్ట్రీల నుండి రిషబ్ కు ఆఫర్ లు వస్తున్నాయట. అయితే టాలీవుడ్ నుండి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు రిషబ్ శెట్టికి బంపర్ ఆఫర్ ఇచ్చారట. కాంతారా తరహాలో ఒక మంచి సబ్జెక్టు ను రెడీ చేయమని చెప్పారట. తన నిర్మాణంలో దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వనున్నారని వినిపిస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. త్వరలోనే వీరి నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: