ఈ సినిమా మొత్తం ఎలక్షన్ల చుట్టూ జరిగే నేపథ్యంలో కథ ఉన్నట్లుగా ట్రైలర్, టీజర్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక ఈ రోజున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ సినిమా అల్లరి నరేష్ మార్కెట్కు తగ్గట్టుగానే లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా మొత్తం కలుపుకొని 400కు పైగా థియేటర్లలో విడుదల చేశారు ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా థియేటర్లలో విడుదలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్ టాక్ అందుకోవాలి అంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా టార్గెట్ ను అందుకోవాల్సిందే.
ప్రపంచవ్యాప్తంగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం సినిమా దాదాపుగా రూ.4 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలి అంటే కచ్చితంగా రూ.4.50 కోట్ల రూపాయలను కలెక్షన్ సాధించాల్సి ఉంటుంది. నాంది సినిమా తరహాలో ఈ సినిమా కూడా అల్లరి నరేష్ వరించింది అంటే ఇదేమి పెద్ద విషయం కాదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. చివరిగా అల్లరి నరేష్ సుడిగాడు చిత్రంతో రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టారు. నాంది సినిమా కూడా నిర్మాతల కు లాభాన్ని తెచ్చింది మరి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.