సినిమా ఇండస్ట్రీ అన్నాక ప్రేమలు.. విడిపోవడాలు చాలా కామన్.. పెళ్లిళ్లు చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం ప్రస్తుతం ట్రెండింగ్ గా ఉంది.ఎంత గొప్పగా ప్రేమ పుట్టినా కలిసి ఉండే జంటలు చాలా అరుదు. అయితే సినీ ఇండస్ట్రీలో కలిసి నటించే హీరో హీరోయిన్లు అలాగే ఏడడుగులు వేసేందుకు ఆరాటం చూపిస్తారు. సినిమా సమయంలోనే ప్రేమలో పడి పీకల్లోతు మునిగిపోతారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఓ హీరోపై మనసుపడింది. ప్రేమలో మునిగింది. తాజాగా ఆ ఊబిలోంచి బయటకు రాలేకపోతోంది. ఇంటా బయటా లీకులు రావడంతో 'డిసెంబర్2'న ఆ రహస్యాన్ని ప్రకటిస్తానంటూ తాజాగా స్టేట్ మెంట్ ఇచ్చింది.బాలీవుడ్ లో సిద్ధార్థ మల్హోత్రా, కియారా అద్వానీల మధ్య ఏదో ఉందని.. ఈ జంట చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని ఒక రూమర్ ఉంది. ఇటీవల 'కాఫీ విత్ కరణ్ షో'లోనూ ఈ జంట ప్రేమలో ఉన్నట్టు ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చారు.

తాజాగా కియా అద్వానీ ఇక ఇంటా బయట వస్తున్న ఒత్తిడులు తట్టుకోలేక ఓ పోస్ట్ చేసింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'ఈ రహస్యాన్ని ఇక ఎక్కువ కాలం దాచలేను. డిసెంబర్ 2న ప్రకటిస్తాను. వేచిచూడండి' అంటూ హింట్ ఇచ్చింది.

దీంతో కియా అద్వానీ తన ప్రేమ, పెళ్లి గురించే ఏదో బాంబు పేల్చబోతోందని.. సిద్ధార్థ్ తో ప్రేమ విషయం బయటపెట్టి ఈ బ్యూటీ పెళ్లికి రెడీ అయిపోతోంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీళ్లద్దరి పెళ్లి డేట్ ఫిక్స్ చేశారని.. కియారానే అది అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతోందని తెలుస్తోంది.కియారా-సిద్ధార్థ్ లు బాలీవుడ్ లో పలు సినిమా ఫంక్షన్లకు, పలు ఈవెంట్లకు కలిసి వెళ్లడంతో వీరి ప్రేమ విషయం బయటపడింది. ప్రస్తుతం కియారా స్పందన చూస్తే ఖచ్చితంగా అది పెళ్లి గురించేనని అంటున్నారు. నిజమెంటో తెలియాలంటే డిసెంబర్ 2 వరకూ ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: