ఒక సినిమా విడుదలై థియేటర్ లలో ఫ్లాప్ అందుకున్నప్పటికీ కొన్ని ఏళ్ల తర్వాత  దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ గా మారుతుంది .రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా దగ్గర నుండి గౌతమ్ నంద సినిమా వరకు కల్ట్  స్టేటస్ అందుకున్న సినిమాల లిస్టు పెద్దది. ఇందులో భాగంగానే ప్రభాస్ సాహో  సినిమా కూడా ఉంది ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ అందుకోవడమే ఆలస్యం అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్ .

సినిమా రిలీజ్ అయిన అనంతరం ఆయన అభిమానులు అనుకున్నది జరగలేదు .ఈ సినిమా విడుదలైన మొదటి రోజే నెగిటివ్ టాక్  ను అందుకోవడం జరిగింది .ఇక సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రభాస్ ఇచ్చిన అవకాశం వేస్ట్ చేశాడు అంటూ అనేక విమర్శలు రావడం జరిగింది .350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమా కొన్న ప్రతి ఒక్కరూ నష్టపోతారు అని అనుకున్నారు... కానీ ఈ సినిమా విషయంలో అలా ఏమాత్రం జరగలేదు. ఈ సినిమా నిరాశపరిచినప్పటికీ 450 కోట్ల రూపాయలను రాబట్టింది.

ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడేళ్లు పూర్తికా వస్తుంది. అయితే మూడేళ్ల తర్వాత ఈ సినిమా ఇప్పుడు హిట్ టాక్ ను అందుకుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక అలా పోస్టు పెడుతున్న వారిలో మెగా అభిమానులే అధిక సంఖ్యలో ఉండడం విశేషం .ఇదిలా ఉంటే ఇక డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చన  సంగతి తెలిసిందే .ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్రెండ్స్  సంతోషపడుతున్నారు. అంతేకాకుండా స్వతహాగా పవన్ కళ్యాణ్ కి హార్ట్ కోర్ ఫ్యాన్ అయిన సుజిత్ తన సినిమాలో ప్రభాస్ తో క్యామియో ఏదైనా ఉంటే ప్లాన్ చేస్తాడా లేదా అన్నది చూడాలి .దీంతో ఈ విషయం తెలిసిన వారి అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: