దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి , ఇండియా లోనే గొప్ప దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్" మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే "ఆర్ ఆర్ ఆర్" మూవీ కి గాను రాజమౌళి కి న్యూయార్క్ ఫిలిమ్స్ క్రిటిక్స్ సర్కిల్స్ నుంచి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డ్ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ కి గాను రాజమౌళి కి న్యూయార్క్ ఫిలిమ్స్ క్రిటిక్స్ సర్కిల్ నుండి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ రావడం పై తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించాడు.

రాజమౌళి కి ఈ అవార్డ్ రావడం పై రామ్ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన అవార్డ్ వచ్చినందుకు కంగ్రాజులేషన్స్ రాజమౌళి గారు. ఈ పురస్కారానికి మీరు 100% అర్హులు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు అంటూ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇది ఇలా ఉంటే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించాడు. ఈ మూవీ ద్వారా రామ్ చరణ్ కు కూడా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన మగధీర మూవీ లో కూడా రామ్ చరణ్ హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: