ఏ ఇండస్ట్రీలో అయిన హీరోలకు ఒక మైల్ స్టోన్ మూవీ అనేది ఉంటుంది.. వారి కెరీర్ మొత్తంలో ఒక్కో దశలో ఒక్కో మైల్ స్టోన్ సినిమా ఉంటుంది.. హీరోలు ఆ ప్రాజెక్టులను అత్యంత స్పెషల్ గా చూస్తుంటారు.
ఒక హీరోకు 25వ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా నిలిస్తే.. మరొక హీరోగా 50వ సినిమా ఇంకో హీరోకు 75, 100వ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి.. మరి సీనియర్ హీరోల నుండి ఇప్పుడు ఉన్న హీరోల వరకు మైల్ స్టోన్ మూవీలతో రెడీ అవుతున్నారు.. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రెజెంట్ సీనియర్ హీరో నాగార్జున తన 100వ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు.. ఘోస్ట్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న నాగ్ ఇప్పుడు 100వ ప్రాజెక్ట్ కోసం కథలు విని వాటిని ఫైనల్ చేసే పనిలో పడ్డారు..

అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన 25వ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు.. ఈ మూవీని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా డైరెక్ట్ చేయబోతున్నాడు.. ఈ మూవీకి స్పిరిట్ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేసారు.. ప్రెజెంట్ వీరిద్దరూ విడివిడిగా ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు.. అవి పూర్తి అయ్యాక కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు..

అలాగే ఎన్టీఆర్ కూడా తన కెరీర్ లో అత్యంత ముఖ్యంగా భావిస్తున్న 30వ ప్రాజెక్ట్ ను స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్నాడు. ఇది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాను ప్రకటించాడు.. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కూడా తన కెరీర్ లో 25వ ప్రాజెక్ట్ గా కృష్ణమ్మ లో నటిస్తున్నాడు.. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ కొరటాల సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.. అలాగే రవితేజ 75వ సినిమా మైలు రాయికి, అల్లు అర్జున్ 25వ సినిమా మైల్ స్టోన్ కు త్వరలోనే చేరుకోనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: