భారత్ లో సంచలనం విజయాన్ని అందుకున్న దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి మూవీ 'ఆర్ఆర్ఆర్'.. జపాన్ లో దుమ్మురేపుతోంది. జక్కన్న ప్రతిష్ట్మాత్మక చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఆర్ఆర్ఆర్' ప్రదర్శింపబడుతున్న హాల్స్ అన్నీఆడియెన్స్ తో కిటకిటలాడుతున్నాయి. జపాన్ లో ఈ సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్నా సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతోంది. జపాన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల రికార్డు సాధిస్తోంది. ఇప్పటి వరకు రూ. 20 కోట్ల రూపాయలు సాధించిన ఈ సినిమా, అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా ఉన్న రజనీకాంత్ 'ముత్తు'ను బీట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

జపాన్ లో రికార్డులు సృష్టిస్తున్న 'ఆర్ఆర్ఆర్'

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ చిత్రం జపాన్‌లో విడుదలైనప్పటి నుంచి సరికొత్త రికార్డులను సాధిస్తూనే ఉంది. జపాన్ లో ఈ సినిమా ఇప్పటికే సాహో, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ లాంటి పలు భారతీయ బాక్సాఫీస్ హిట్‌లను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం జపాన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా నిలిచింది. త్వరలో నెంబర్ వన్ స్థానంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

రజనీకాంత్ 'ముత్తు' రికార్డు బద్దలు కొట్టే అవకాశం!

 జపాన్ బాక్సాఫీస్ దగ్గర 'RRR' ఇప్పటి వరకు రూ. 20 కోట్లు రాబట్టింది. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా 'ముత్తు' ఈ సినిమా కంటే వసూళ్లలో కాస్త ముందుంది. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన 'ముత్తు' సినిమా ఇప్పటికీ జపాన్‌లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా కొనసాగుతోంది. అప్పట్లోనే ఈ సినిమా రూ. 23.50 కోట్లు వసూలు చేసింది. 'RRR' మూవీ మరికొద్ది రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.

'ఆర్ఆర్ఆర్-2' కథపై చర్చలు

భారత్ సహా పలు దేశాల్లో ఇప్పటికే 'RRR' మూవీ ప్రభంజనం సృష్టించింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళల సునామీ సృష్టించింది. ఇక ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్- 2' కోసం చర్చలు నడుస్తున్నట్లు ఇటీవలే దర్శకుడు రాజమౌళి తెలిపారు. అమెరికాలోని ఓ అవార్డుల వేడుకలో పాల్గొన్న ఆయన ఈ సినిమా సీక్వెల్ పై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే, ఆ చర్చలు ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు చెప్పారు. తాను తీసే సినిమాలకు తన దండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలు రాస్తారని చెప్పిన ఆయన.. 'ఆర్ఆర్ఆర్-2' కు సంబంధించిన చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈ చర్చల్లో తన టీమ్ మెంబర్స్ పాల్గొన్నట్లు వెల్లడించారు. అటు విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమా సీక్వెల్ ను ధృవీకరించారు. అయితే, ఎప్పుడు ఈ సినిమా పనులు మొదలువుతాయి? అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి సీక్వెల్ ఉంటుందనే క్లారిటీ మాత్రం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: