ఎన్నో అంచనాలతో గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ "హిట్ 2" కు మంచి రివ్యూలు మరియు అశేష ప్రేక్షకాదరణ దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా గతంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ ది ఫస్ట్ కేస్ కు సీక్వెల్ కాకపోయినా, హిట్ ను ఒక ఫ్రాంచైజీగా చేసి అందులోనే డిఫెరెంట్ కేసులను ఛేదిస్తూ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా హిట్ 2 ఒక మంచి మర్డర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో పాన్ ఇండియా హీరో అడవి శేష్ హీరోగా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. హిట్ ను తెరకెక్కించిన డైరెక్టర్ శైలేషు కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం.

అయితే మొదటి రోజు సాలిడ్ కలెక్షన్ లను సాధించి భారీ వసూళ్లపై నమ్మకం కలిగేలా చేసింది. ఆ విధంగా మొదటి రోజు ఏకంగా దగ్గర దగ్గర 4 కోట్ల రూపాయల వసూళ్లను షేర్ రూపంలో అందుకుని షాక్ ఇచ్చింది. ఇక ఈ వారంలో పెద్ద సినిమాలు రిలీజ్ ఏవీ లేకపోవడంతో, రెండు వారాలకు కలిపి హిట్ 2 కు బాక్స్ ఆఫీస్ వద్ద 30 కోట్ల వరకు వసూళ్ల వర్షం తప్పదని సినీ వర్గాలు భావించారు . అయితే అనుకున్న విధంగా కాకుండా దాదాపు మొదటి మూడు రోజుల పాటు పది కోట్ల కన్నా తక్కువే కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

వీక్ ఎండ్ లో తక్కువ కలెక్ట్ చేసిన ఈ సినిమాపై వీక్ డేస్ లో ఎక్కువ ఆశించడం పొరపాటే అవుతుంది. అలా సోమవారం రోజున కేవలం కోటి రూపాయల మేరకు వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. దీనితో కేవలం మూడు రోజుల తర్వాత సగానికి పైగా కలెక్షన్ లు తగ్గడంతో అందరిలో గుబులు మొదలైంది. ఎన్నో అంచనాలు పెట్టుకుంటే ఇలా అయిందేంటి అంటూ గారాలు పోతున్నారు. ఆఖరికి మంచి కూల్ కాప్ సినిమా ఇలా నిరాశ పరిచింది.  

 



మరింత సమాచారం తెలుసుకోండి: