మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు..అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు ఇతరులతో భాషలలో కూడా బాగా దూసుకుపోతుంది.యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా నటిస్తూ దూసుకుపోతోందని తెలుస్తోంది..తాజాగా ఆమె నటించిన సినిమా గుర్తుందా శీతాకాలం. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టైల్ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహించాడు.


ఇందులో సత్యదేవ్ హీరోగా నటించాడు. మొత్తానికి ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కావడానికి సిద్ధంగా ఉండగా ప్రస్తుతం ప్రమోషన్స్ భాగంలో ఈ సినీ బృందం బిజీగా ఉన్నారు.అయితే తాజాగా తమన్నా కూడా ప్రమోషన్స్ భాగంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక అందులో చాలా విషయాలు పంచుకుంది. రీమేక్ సినిమాలో నటించడం అనేది కొత్త కాదు అంటూ.. ఒరిజినాలిటీని మిస్ కాకుండా ఛాలెంజ్ లా తీసుకొని చేస్తాను అని.. ఎందుకంటే వాళ్ళు అప్పటికే క్యారెక్టర్స్ చేసి ఉంటారు కాబట్టి చూసే ప్రేక్షకులకు బోరు కొట్టకుండా క్యారెక్టర్ చేయటమే ఛాలెంజింగ్ గా తీసుకుంటాము అని తెలిపింది.


ఇక లవ్ స్టోరీ లలో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొంతవరకు కష్టం అని.. కానీ ఆ సినిమాలలో తను చేసిన ఎమోషన్స్ బాగా ఆకట్టుకుంటాయి అని తెలిపింది. సినిమాను పోలిన సినిమాలు ఉంటాయని.. కానీ అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుందని.. అందులో కూడా కొత్త ఎమోషన్స్, కొత్త పాయింట్ ను కూడా ప్రేక్షకులకు చెబుతుంటాము అని తెలిపింది.ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. సత్యదేవ్ తో నటించడం తనకు సంతోషంగా ఉందని తెలిపింది. ఇక సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూసిన తర్వాత నటన చాలా న్యాచురల్ గా ఉందని తెలిపింది. అందుకే ఆయనతో చేయాలని ఆసక్తి కలిగింది అంటూ.. ఇక ఈ సినిమాతో అవకాశం రావడంతో ఆ కోరిక తీరింది అని తెలిపింది.


హీరో స్టేజ్ చూడను కానీ కథ నచ్చితే ఎవరైనా ఒకటే..ఇప్పటివరకు తను యాక్టర్, డైరెక్టర్ అయినవారితో సినిమాలు ఎప్పుడు చేయలేదు అంటూ.. ఇక డైరెక్టర్, యాక్టర్ నాగశేఖర్ తో చేయటం తనకు బాగా అనిపించింది అని.. ఆయన నటుడు కావడంతో క్యారెక్టర్స్, ఎమోషన్స్ కరెక్టుగా అర్థం చేసుకొని మాతో చేయించాడు అని తెలిపింది..ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పక చూడవచ్చునని అమ్మడు చెప్పింది..మరి ఎలాంటి హిట్ ను అందుకుంటుందొ చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: