నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. 21 మందితో ప్రారంభమైన ఈ షో ఇటీవల ఫైమా ఎలిమినేట్ అవ్వడంతో ఆఖరిగా  ఏడు మంది మిగిలారు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు శ్రీహాన్ మినహా మిగిలిన 6 మంది ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉన్నారు .అయితే వీరిలో ఉన్న ఓటింగ్ ప్రకారం శ్రీ సత్య మరియు కీర్తి ఈ వారం ఎలిమినేట్ అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం చూస్తే ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చూద్దాం... ప్రతివారం లాగానే నంబర్ వన్ స్థానంలో అత్యధిక ఓటింగ్ తో రేవంత్ ఉన్నాడు. మొదటి వారం నుండి ఇప్పటివరకు రేవంత్ కి ఓటింగ్ ఇదే రేంజ్ లో ఉండడం గమనార్హం.

ఆయన తర్వాత ఇనాయ రెండవ స్థానంలో ఉంది వీరి తరువాత మూడో స్థానంలో రోహిత్ కాగా ఆదిరెడ్డి నాలుగో స్థానంలో ఉన్నాడు .తాజాగా ఓటింగ్ లో రోహిత్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదు రోహిత్ టాప్ త్రీ లో ఒకరిగా నిలిచే అవకాశం ఉంది అని అంటున్నారు ఇక ఆదిరెడ్డి ఓటింగ్ గతవారంతో పోలిస్తే మంచి ఓటింగ్ తో ముందున్నాడు. ఇదిలా ఉంటే ఇక గత వారంలో టికెట్ టు వినాలే టాస్క్ లో భాగంగా ఆదిరెడ్డి గెలిచాడనే ప్రచారం జరిగింది. అందుకుగాను ఆయనకి ఓటింగ్ తగ్గినట్లు కొందరు చెబుతున్నారు.

ఎందుకు అంటే టికెట్ టూ గెలుచుకున్న వాళ్ళు నేరుగా ఫైనాన్స్ కి వెళ్తారని వాటికి ఓటు వేసిన కూడా ఉపయోగం ఉండదు అనే భావన వల్లే ప్రేక్షకులు ఆయనకు ఓటు వేయలేదు. దీనికిగాను బుధవారం ఆదిరెడ్డి ఓటింగ్ తగ్గింది .కానీ ఈ వారం మాత్రం మంచి ఓటింగ్ తో దూసుకుపోతున్నాడట ఆదిరెడ్డి. కాగా టాప్ ఫైవ్ లో రేవంత్ రోహిత్ శ్రీహాన్ ఆదిరెడ్డి మరియు ఇనాయ వెళతారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: