టాలీవుడ్ లో రవితేజ తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నాడు. ఆ మార్కుతోనే వరుస సినిమాలలో నటిస్తూ మాస్ మహారాజా పేరును సార్ధకం చేసుకుంటున్నాడు. కాగా రవితేజకు ఆఖరి హిట్ సినిమా అంటే క్రాక్ అని చెప్పాలి. మలినేని గోపిచంద్ డైరెక్షన్ లో వచ్చిన క్రాక్ కాప్ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. ఆ తరువాత వచ్చి రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. వాటిలో "ఖిలాడీ" మరియు "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు వేరే వేరే కథలు అయినా కథలలో కొత్తదనం లోపించడంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయి.

అందుకే రవితేజ కెరీర్ లో రానున్న మరో సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి తీరాలన్న కసితో "సినిమా చూపిస్త మావ" మరియు "నేను లోకల్" వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కినతో "ధమాకా" సినిమాను చేశాడు. ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇందులో రవితేజ సరసన కన్నడ భామ శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు కూడా శ్రోతలను బాగా ఆకట్టుకుంటున్నాయి. రవితేజకు హిట్ దక్కి దాదాపు సంవత్సరం దగ్గర పడుతోంది.

అందుకే ఈ సినిమాపై రవితేజ అభిమానులు ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. క్రాక్ సినిమా ముందు కూడా రవితేజకు వరుసగా నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి. వాటిలో టచ్ చేసి చూడు, నేల టికెట్ , అమర్ అక్బర్ ఆంథోనీ మరియు డిస్కో రాజా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా ప్లాప్ అయితే హ్యాట్రిక్ ప్లాపులతో ఇంకా కష్టాల్లో పడిపోతాడు. మరి ఈ సినిమాతో హిట్ కొట్టి లైన్ లో పడతాడా లేదా తెలియాలంటే డిసెంబర్ 23 వరకు ఆగాల్సిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి: