పటాస్ షో తో పరిచయమైన ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ షో తో  మంచి గుర్తింపు పొందిన ఈమె దాని అనంతరం జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది.  తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పైమా పెద్ద హీరోల అటెన్షన్ను సైతం దక్కించుకుంది. దాని అనంతరం  ఎవరు ఊహించిన విధంగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ కార్యక్రమంతో మంచి పాపులారిటీని అందుకున్న ఈమె బిగ్ బాస్ కి వెళితే తర్వాత అవకాశాలు తగ్గుతాయి అని ఎంతోమంది చెప్పినప్పటికీ ఎవరి మాట వినకుండా బిగ్బాస్ షో కి వెళ్ళింది. 

ఫైనల్ వరకు వెళ్లి విన్నర్ అవుతే భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఆశించి బిగ్బాస్ షో కి వెళ్ళింది. కానీ ఎవరు ఊహించిన విధంగా మధ్యలోనే బయటకు రావడం జరిగింది.దీంతో తను ఆశించిన డబ్బు కూడా ఫైమాకి దక్కలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ జబర్దస్త్  కి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అని అడుగుతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది జబర్దస్త్ కి తిరిగి రావాలి అని ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని సాధారణంగా బిగ్బాస్ షో కి వెళ్లిన కంటెస్టెంట్లు ఒక ఏడాది పాటు స్టార్ మా లోనే ఉండాలని మరి ఏ ఇతర చానల్స్ లో పాల్గొనే అవకాశం వీరికి ఉండదు అని అంటున్నారు.

అయితే బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఒకసారి వెళితే దాని తర్వాత మళ్లీ జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి వచ్చే అవకాశాలు లేనట్లే అని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈమె మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ  ఇచ్చే అవకాశాలు లేనట్టే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఫైమ మాటీవీలో ప్రసారమవుతున్న ఒక డాన్స్ షోలో పాల్గొంటుంది. మంచి రెమ్యునరేషన్ కూడా  దక్కుతున్నట్లు తెలుస్తుంది. అయితే ముందు ముందు స్టార్ మా లో ఒక కామెడీ షో కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ కామెడీ షో లో పైన సందడి చేస్తుంది అని పైమా అభిమానులు ఆశిస్తున్నారు. బిగ్బాస్ కి వెళ్లిన అనంతరం ఫైమాకి సినిమాల్లో కూడా నటించే అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: