ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాలీవుడ్ యాక్టర్ చార్టులలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. 2022 సంవత్సరానికి గానూ అత్యధిక గూగుల్ ట్రెండ్ పేర్లను విడుదల చేయగా.. అందులో మొదటి స్థానం అల్లు అర్జున్ కైవసం చేసుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గూగుల్ సర్చ్ లిస్టులో అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉండడం ఇది రెండవసారి. 2022లో తన సినిమాలు విడుదలకుండానే టాప్ ఫైవ్ లిస్టులో అల్లు అర్జున్ మాత్రమే ఉన్నారు.

2021 డిసెంబర్లో పుష్ప: ది రైజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత మరే సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించలేదు. అయినా కూడా గూగుల్ సెర్చ్ లో మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఈ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు రెండవ స్థానంలో ఉండగా.. మూడవ స్థానంలో ప్రభాస్.. నాలుగవ స్థానంలో రామ్ చరణ్.. ఐదవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. మహేష్ బాబు గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతోనే కాకుండా తన తల్లి, తండ్రిని కోల్పోయి వ్యక్తిగతంగా కూడా వార్తల్లో నిలిచారు.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా 2022 ప్రారంభంలో తెరపైకి వచ్చింది.  ఆ తర్వాత ఆదిపురుష్ టీజర్ కూడా విడుదల చేసి వార్తల్లో నిలిచారు ప్రభాస్.  ఆ తర్వాత  సలార్ షూటింగ్ సెట్ నుండి లీకైన ఫోటోలు కూడా అందరి దృష్టి ఆకర్షించేలా చేశాయి. మరోవైపు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో రామ్ చరణ్ , ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉండగా ఎన్టీఆర్ , మహేష్ బాబు,  అల్లు అర్జున్ తమ తదుపరి చిత్రాల షూటింగ్లలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: