టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతటి స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఎంత ఎదిగిన ఒదిగి ఉండడంలో ముందుంటాడు డైరెక్టర్ రాజమౌళి. ప్రస్తుతం వరుస విజయాలతో ఊహించని స్థాయిలో రాజమౌళి దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలతో పనిచేసి వారి కెరియర్ బెస్ట్ హిట్ సినిమాలు ఇచ్చి ఆ హీరోల కెరియర్ సక్సెస్ లో కీలక పాత్ర వహించాడు రాజమౌళి. రాజమౌళి ఒక్క సినిమాకి ఏకంగా మూడు నుండి నాలుగు ఏళ్ల సమయం కేటాయిస్తాడు. 

ఇక ఇలాంటి పని ఒక రాజమౌళికి మాత్రమే సాధ్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన  ఒక్క సినిమా కోసం రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడతాడు. దానికి తగ్గ ఫలితాన్ని దక్కించుకుంటూ ఎందరో దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రాజమౌళి. రాజమౌళి ఇంతటి సక్సెస్ అందుకోవడానికి చూసి ఇతర డైరెక్టర్లు షాక్ అవుతుంటారు. తాజాగా రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ కి నామినేట్ అవ్వడంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ ఈ సందర్భంగా రాజమౌళికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది.

 దాంట్లో ఒక మీటింగ్ రూమ్ లో దిగిన ఫోటోని సుకుమార్ షేర్ చేయడం జరిగింది.ఇందులో భాగంగానే ఆయన... ఇన్ని రోజులుగా నా మీటింగ్ లో సమయంలో ప్రిన్సిపల్ కుర్చీని ఖాళీగా వదిలేసాను.. ఎందుకో ఎన్ని రోజులు దాన్ని ఖాళీగా వదిలేసాను ఇప్పుడు అర్థమైంది...ఆ కుర్చీ కేవలం ఎస్ఎస్ రాజమౌళికి మాత్రమే సొంతమని.. ఈ సందర్భంగా ఆయన అభిప్రాయాన్ని తెలియజేశాడు. డైరెక్టర్ సుకుమార్ ఈ కుర్చీ ఎప్పటికైనా రాజమౌళిదే అని.. భవిష్యత్తులో కూడా నా గురించి ఆయనదే అని.. చెప్పుకొచ్చాడు సుకుమార్.అంతేకాదు ఈ సందర్భంగా రాజమౌళి అండ్ టీం కి నా అభినందనలు అని చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఒక స్టార్ డైరెక్టర్ మరొక స్టార్ డైరెక్టర్ ప్రతిభను ప్రశంసించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.ఇక అలాంటి ఒక అరుదైనా ఘనత ఒక్క రాజమౌళికే సొంతమైంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: