డబ్ స్మాస్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ అయిన వారిలో..అషు రెడ్డి కూడ ఒకరు. అంతేకాకుండా జూనియర్ సమంత గా పేరు సంపాదించడంతో ఈమెకు కాస్త ప్లస్ అయిందని చెప్పవచ్చు. తన అందం తో యువత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్ తోనే నెమ్మదిగా యూట్యూబ్లో కూడా మంచి పాపులారిటీ అందుకుంది అషు రెడ్డి. డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో కలిసి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది.బిగ్ బాస్ రియాల్టీ షోలో ఈమె రెండు సార్లు అవకాశం సంపాదించిన విన్నర్ గా కాలేక పోయింది. ఇక సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. నటిగా అషు రెడ్డి పలు అవకాశాలను అందుకుంటోంది. చివరిగా ఫోకస్ అనే ఒక కామెడీ హర్రర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించింది.ఇందులో నటనకు మంచి గుర్తింపు దక్కింది అవకాశాన్ని అందుకుంది. AMC అనే ఒక చిత్రంలో నటిస్తున్నట్లు సమా చారం. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ.ఇక మరొక చిత్రం షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్లో పులివెందులలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ పల్లె ప్రాంతంలోని అందాలను ఆస్వాదిస్తూ ఉదయం పొద్దు తిరుగుడు పువ్వును ముద్దాడుతూ దర్శనమిస్తున్నట్లు సాయంత్రం వేళ మూగజీవాలకు మేత వేస్తున్నట్లు కనిపిస్తోంది.అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సైతం షేర్ చేయడం జరిగింది. ఎరుపు చీర లో విలేజ్ వెబ్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది అషు రెడ్డి. ఈ ఫోటోలు అటు అభిమానులతో పాటు నేటిజన్లను కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: