న్యాచురల్ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ‘దసరా’. శ్యామ్‌ సింగరాయ్‌, అంటే సుందరానికీ సినిమాల తర్వాత నాని నటిస్తోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో చాలా భారీ అంచనాలు ఉన్నాయి.నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ పై ఉన్న హైప్ బాగా పెరిపోయింది. నాని ఇప్పటి దాకా ఎప్పుడూ నటించని ఊర మాస్ పాత్రలో కనిపించనున్నారు. 1980 తెలంగాణలోని సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ సినిమాపై ఓ రేంజ్‌లో బజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా టీజర్ రిలీజ్ అయ్యి ఊర మాస్ అనే పదానికి పర్యాయ పదంలా నిలిచింది.ముఖ్యంగా అత్యంత సహజంగా ఉన్న లొకేషన్స్‌ ప్రేక్షకులను గతంలోకి తీసుకెళ్లినట్లు సినిమా ఉంది. సింగరేణి నేపథ్యంలో చోటుచేసుకున్న సంఘటనలు కళ్లకు కట్టిగనట్లు చూపించనున్నట్లు తెలుస్తుంది. 


ఇదిలా ఉంటే ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.విడుదలకు ఇంకా రెండు నెలల టైం ఉండగా మూవీ యూనిట్‌ ఇప్పటి నుంచే ప్రమోషన్స్‌ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే సోమవారం నాడు టీజర్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా టీజర్‌ను విడుదల చేశారు. హిందీ టీజర్‌ను షాహిద్‌ కపూర్‌, తమిళ్‌ టీజర్‌ను ధనుష్‌, మలయాళం టీజర్‌ను దుల్కర్‌ సల్మన్‌ ఇంకా కన్నడ టీజర్‌ను రక్షిత్‌ శెట్టి లాంచ్‌ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్‌లో టీజర్‌ ఈవెంట్‌ను మల్లారెడ్డి కాలేజీలో జరిపారు. టీజర్ చూస్తుంటే నాని వన్ మ్యాన్ షోతో ఊర మాస్ అవతారంతో ఆకట్టుకున్నారు. మునుపెన్నడూ కనిపించని విధంగా మాస్ పాత్రలో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా టీజర్ చివరిలో నోటిలో కత్తి పెట్టుకొని కనిపించే సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: