మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలా చిన్న స్థాయి నుండి మెగాస్టార్ గా ఎదిగి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో కష్టాల అనంతరం తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగాడు.చిరంజీవి వ్యక్తిగతంగా కూడా చాలామందికి ఆదర్శం. హీరోగా చాలామంది హీరోయిన్లతో కలిసి నటించాడు మెగాస్టార్ చిరంజీవి. చాలామంది హీరోయిన్లతో కలిసి నటించినప్పటికీ ఏ హీరోయిన్ తో కూడా రాసుకుపోసుకొని తిరగలేదు. చిరంజీవి అంటే ఒక తెరిచిన పుస్తకం అని చాలామంది చెబుతూ ఉంటారు. ఇప్పటివరకు ఆయన జీవితంలో ఎలాంటి మచ్చ లేదు. 

కానీ ఒక విషయంలో మాత్రం చిరంజీవి చాలా ఇబ్బంది పడ్డారు అని తెలుస్తుంది. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని త్వరలోనే ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అన్ని రకరకాల వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆ హీరోయిన్ కోసం చిరంజీవి తన భార్య సురేఖకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అని అప్పట్లో జోరుగా రూమర్లు వచ్చిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే... సుమలత.సుమలత మరియు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. వారిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి.

వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదరడంతో వీరిద్దరిపై అప్పట్లో రకరకాల రూమర్లు రావడం జరిగాయి. ఇక వాటిపై సీనియర్ హీరోయిన్ సుమలత చాలా సీరియస్ గా కూడా రియాక్ట్ అయింది.అంతేకాదు వారిద్దరిపై వస్తున్న ఇలాంటి పుకార్లకు గాను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది సీనియర్ హీరోయిన్.అంతే కాదు అప్పట్లో చిరంజీవి కూడా ఈ రూమర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ వార్తలను ఖండించాడు.ఇక వీరిద్దరిపై ఇలాంటి రూమర్లు రావడంతో వీరిద్దరూ కలిసి సినిమాల్లో కలిసి నటించకూడదు అని నిర్ణయం తీసుకున్నారట. ఈ ఒక్క రూమర్ తప్ప చిరంజీవి పై ఎలాంటి రూమర్లు లేవు. దీంతో మెగాస్టార్ చిరంజీవి మరియు సీనియర్ హీరోయిన్ సుమలతకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: