తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో హాస్యనటులుగా తమ కెరీర్ ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి , ఆ తర్వాత హీరోలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ కొందరు మాత్రమే హీరోలుగా సక్సెస్ అయ్యి కెరీర్ లో నిలబడ్డారు. చాలా వరకు ప్లాప్ అయినవారే... అలాంటి వారిలో బ్రహ్మానందం , బాబూమోహన్, సునీల్, అలీ లు ముందు వరుసలో ఉన్నారు. ఒకసారి కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యాక అద్భుతం జరిగితే తప్ప హీరోగా యాక్సెప్ట్ చేయడం కష్టమే అని చెప్పాలి. అదే విధంగా ఒక యువ కమెడియన్ మరియు నటుడు సుహాస్ మెల్ల మెల్లగా కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు హీరోగా సెటిల్ కావడానికి గట్టిగానే కష్టపడుతున్నాడు.

అలా సుహాస్ హీరోగా చేసిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. "కలర్ ఫోటో" అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మ్యూజికల్ హిట్ ను అందుకున్నాడు. సంగీత దర్శకుడు కాల భైరవ అందించిన పాటలు మరియు నేపధ్య సంగీతం సినిమా విజయంలో కీలకంగా మారాయి. ఈ సినిమాతో తనలో హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు కూడా కనిపెట్టేశాయి. అందుకే మరో సినిమాను తనతో తీసి హిట్ కొట్టడానికి ఇవాళ థియేటర్ లలో రిలీజ్ అయింది "రైటర్ పద్మభూషణ్". ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ తీర్చిదిద్దాడని చెప్పాలి. ఉదయం షో నుండి ఈ సినిమా పట్ల వస్తున్న స్పందన చూస్తుంటే సుహాస్ మరో హిట్ ను కొట్టాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో సుహాస్ కు సరసన టీనా శిల్ప రాజ్ నటించింది. మిగిలిన పాత్రలలో రోహిణి , ఆశిష్ విద్యార్థి, శ్రీగౌరీ ప్రియ, గోపరాజు రమణ లు నటించి సినిమా హిట్ అవడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాకు శేఖర్ చంద్ర గుండెలు బరువెక్కిపోయే సంగీతాన్ని అందించాడని టాక్ వినిపిస్తోంది. ఈ రోజు విడుదలైన సినిమాలలో కన్నా రైటర్ పద్మభూషణ్ కే ఎక్కువ మార్కులు పడినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: