తెలుగు చిత్రసీమలో ఫుల్ బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో ఎస్ఎస్ థమన్ కూడా ఒకడు.రీసెంట్ గా వచ్చిన బాల కృష్ణ సినిమా వీర సింహారెడ్డి సినిమాకి థమన్ మంచి BGM అందించి నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా విజయంలో థమన్ పాత్ర కూడా ఉంది.ఇప్పుడు థమన్ పెద్ద హీరోల సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB28, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ వంటి టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు కూడా థమన్ లిస్టులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం SS థమన్ ఇంస్టాగ్రామ్, ట్విట్టర్‌లో చాలా దారుణంగా ఎదుర్కొంటున్నాడు. 


ముఖ్యంగా మహేష్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా దారుణంగా థమన్ ని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాన్ – సుజీత్ ప్రాజెక్ట్ కి కూడా థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనౌన్స్ చెయ్యడంతో పవన్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని ఎక్స్ పెక్ట్ చేశారు.కానీ, మేకర్స్ మాత్రం థమన్ ని సెలక్ట్ చేశారు. దీంతో థమన్ పై ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అలాగే మహేష్ అభిమానులు కూడా థమన్ పనితీరు నచ్చక ఓ రేంజిలో ఆడుకున్నారు. 


ఇంకా అంతే కాకుండా థమన్ సొంత ట్యూన్స్ కాకుండా, కాపీ ట్యూన్స్ కొట్టడం అలాగే ఏ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా కూడా అదే అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెప్పడం ఇంకా ఆ మూవీలోని హీరో అతని ఫేవరేట్ అని చెప్తూ ఉండటం ఏ హీరో ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. దీంతో థమన్ పై ఒక రేంజిలో ట్రోల్స్‌ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులుగా ఇదే ట్రెండ్ అవుతుంది. దీంతో కూల్ గా ఉండే థమన్ తన ఓపికను కోల్పోయి ఇంస్టాగ్రామ్,ట్విట్టర్‌లో తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ రియాక్ట్ అయ్యాడు.


అయితే.. అది కూడా క్రియేటివ్‌గానే రియాక్ట్ అయ్యాడు.  థమన్ హేటర్స్ కి “గెట్ లాస్ట్” అని చెప్పే ఆడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు. "Rest In Peace Dear #Negativity !! To all the kids out there అంటూ థమన్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చేయడంతో థమన్ ఇంకా దారుణంగా ట్రోల్ అవుతున్నాడు. మహేష్, పవన్ అభిమానులు అయితే థమన్ ని పచ్చి బూతులతో తిడుతూ చుక్కలు చూపిస్తూ థమన్ ని నరకయాతనకి గురి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: