నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ వన్ మరియు సీజన్ 2 షో లు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ రెండు సీజన్లలో కూడా చిరంజీవి ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ రాలేదు. అయితే కొన్ని రోజుల క్రితం చిరంజీవిని అన్ స్టాప్ షో కి ఎందుకు రాలేదు అని అడిగితే.. ఆ షో నుండి తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదు అని అందుకే ఆ షో కి  నేను హాజరు కాలేదు అంటూ చిరంజీవి ఇటీవల క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ కూడా ఇది సమాధానాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. 

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఎందుకు బాలయ్య షో కి రాలేదో ఆ హా వాళ్లని అడగండి అంటూ కొన్ని కామెంట్లను చేయడం జరిగింది. అయితే ఇటీవల ఆమిగోస్  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక కళ్యాణ్ రామ్ చేసిన ఈ కామెంట్లపై ఆహా షో నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం నందమూరి అభిమానులు మాత్రం అం స్టాపబుల్  సీజన్ 3 కోసం  ఎంతగానో  చూస్తున్నారు. సీజన్ వన్ మరియు సీజన్ 2లకు పలువురు సెలబ్రిటీలో రాలేదు. దీంతో సీజన్ 3 లో అయినా వారందరూ వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.

అయితే బాలయ్య షోకి రామ్ చరణ్ కూడా రావాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఈ షో సీజన్ 3 కి సంబంధించిన అప్డేట్ ని త్వరగా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ గెస్ట్ ల సెలెక్షన్ లో కీలక పాత్ర వహిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు బాలయ్య మరియు బాలయ్య నిర్ణయాల వల్ల ఆహ నిర్వాహములకు ఊహించిన స్థాయిలో లాభాలు వస్తున్నాయి. దీంతో సీజన్ 3 మరింత ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. అంతే కాదు ఇతర భాషల సెలబ్రిటీలను సైతం సీజన్ 3 కి ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: