సినిమా ఇండస్ట్రీ లో ఏ సపోర్ట్ లేకుండా వచ్చిన హీరోల్లో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటె రవితేజ రెండవ స్థానంలో ఉంటాడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన రవి తేజ ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఒక టాప్ హీరోగా మారిపోయారు.

ఈయన చేసిన సినిమాలు ప్రేక్షకులని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ఈయన కెరియర్ లో చాలా మంది కొత్త దర్శకులని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు వాళ్లలో చాలా మంది టాప్ డైరెక్టర్స్ గా గుర్తింపు పొంది ఇప్పటికి ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు.వాళ్లెవరో ఒకసారి మనం తెలుసుకుందాం...

రవితేజతో మొదటి సినిమా చేసిన డైరెక్టర్స్ లో మొదటగా మనం బోయపాటి శ్రీను గురించి చెప్పుకోవాలి. ఈయన రవితేజ తో భద్ర సినిమా తీసి ఒక మంచి విజయాన్ని అందుకున్నారు.ప్రస్తుతం బోయపాటి శ్రీను ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు.ఇక ఈయన తర్వాత లిస్ట్ లో హరీష్ శంకర్...రవితేజ చేసిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా కి కో డైరెక్టర్ గా పని చేసిన హరీష్ శంకర్ టాలెంట్ ని చూసి రవితేజ ఒక సినిమా చేద్దాం స్టోరీ రెడీ చేసుకో అని చెప్పాడట

దాంతో షాక్ అనే సినిమా తీసాడు హరీష్ శంకర్సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది అయిన కూడా మళ్లీ రవితేజనే పిలిచి మరి మిరపకాయ్ సినిమా కి అవకాశం ఇచ్చాడు ఈ సినిమా బాక్సఫీస్ వద్ద హిట్ అయింది... అలా హరీష్ శంకర్ కి రెండు సార్లు ఛాన్సులు ఇచ్చాడు.ఇప్పుడు హరీష్ శంకర్ తెలుగు ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ అయ్యాడు.ఇక డాన్ శీను సినిమాతో గోపీచంద్ మలినేని కి అవకాశం ఇచ్చాడు.ఈ సినిమా మంచి హిట్ అయింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని కూడా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు.బలుపు సినిమాకి రైటర్ అయినా బాబీ కి కూడా పవర్ అనే సినిమాతో డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు.రవితేజ ఇచ్చిన ఛాన్స్ ని బాగా వాడుకొని బాబీ మంచి హిట్ సినిమా తీసాడు.రీసెంట్ గా చిరు తో వాల్తేరు వీరయ్య సినిమా తీసి సక్సెస్ అయ్యేడు బాబీ ఇలా ఇంకా చాలా మందినే రవితేజ తన సినిమాల ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: