ఇలా వరుస విజయవంతమైన మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ చిత్ర బృందం "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరిస్తుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా కనిపించనుండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని షెడ్యూల్ ల షూటింగ్ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ యొక్క షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని త్రివిక్రమ్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి ఈ చిట బృందం ఒక డెడ్ లైన్ ను పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా లోని పాటలు మరియు ఒక ఫైట్ సన్నివేశం మినహా మొత్తం షూటింగ్ ను ఏప్రిల్ నెల వరకు పూర్తి చేయాలి అనే ప్లానింగ్ తో ఈ చిత్ర బృందం మూవీ షూటింగ్ ను చేస్తున్నట్లు తెలుస్తోంది.