ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నటీనటుల పైన వరుసగా పలు రకాలుగా ట్వీట్ చేస్తూ పెను దుమారాన్ని రేపుతున్నారు దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు. పెను సంచలనాలను రేపుతో పలు రకాలుగా ట్విట్ట్లు చేస్తూ ఉన్నారు. గడచిన రెండు రోజుల క్రితం నటుడు పవన్ కళ్యాణ్ పైన పెను సంచలన వాక్యాలు చేశారు. ఇప్పుడు తాజాగా రవితేజ ను టార్గెట్ చేస్తూ పలు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. రవితేజ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి సక్సెస్ అయ్యారు మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ను ప్రారంభించి ఈరోజు మాస్ హీరో రవితేజ గా పేరు సంపాదించారు.



రవితేజ ఇద్దరు సోదరులు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఇద్దరు ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. ఇందులో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. కానీ రవితేజ మాత్రం ఎలాంటి ఆరోపణలకు ఇప్పటివరకు తావు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సంచలనం రేపే విధంగా..ఉమైర్ సంధు ట్విట్ చేయడం జరుగుతోంది. సూపర్ స్టార్ రవితేజ తో పని చేయడానికి ఎంతోమంది హీరోయిన్లు ఐటెం గర్ల్స్ పలు రకాలుగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారని ఆరోపిస్తున్నారు సినిమా షూటింగ్ సమయంలో ఆయన వారి శరీరాలను పట్టుకొని విధానం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వారు భావిస్తున్నారని కామెంట్లు చేశారు.


రవితేజ ప్రతి సినిమాలో కూడా కొత్త నటీమణులను ఇబ్బంది పెడుతుంటారని తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు ఉమైర్ సంధు. దీంతో రవితేజ అభిమానులు మరొకసారి ఈయన పైన విరుచుకుపడుతూ పలు రకాలుగా కామెంట్స్ చేయడం జరుగుతోంది. అసలు ఈ ఉమైర్ సంధు అనే వ్యక్తి ఉన్నారా లేకపోతే సోషల్ మీడియాలో ఒక కల్పిత అకౌంట్ అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఈ విషయంపై క్లారిటీనే రాలేదు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: