పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ లకు కమిట్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ ఫైనల్ స్టేజ్ లో ఉండగానే పవన్ చాలా మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇప్పటికే పవన్ , సముద్ర కని దర్శకత్వంలో వినోదయ సీతం మూవీ కి రీమేక్ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ "ఓజి" అనే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

మూవీ లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో కూడా హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇలా ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ మరో రెండు మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ మరో పాన్ ఇండియా దర్శకుడి మూవీ లో నటించే అవకాశం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా శాండిల్ వుడ్ స్టార్ హీరో లు అయినటు వంటి ఉపేంద్ర ... కిచ్చా సుదీప్ లతో కబ్జా అనే మూవీ ని రూపొందించిన ఆర్ చంద్రు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఆర్ చంద్రు దర్శకత్వంలో రూపొందిన కబ్జా మూవీ నిన్న అనగా మార్చి 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: