
ఇక బాలయ్య విషయం పక్కన పెడితే నందమూరి ఫ్యామిలి నుంచి వచ్చిన హీరోల్లో జూనియర్ ఎన్టీయార్ ఒకరు ఈయన కూడా బాలయ్య రేంజ్ మాస్ హీరోగా ఎదిగాడు. అయితే గత కొద్దిరోజుల నుంచి బాలయ్యకి, ఎన్టీయార్ కి పడటం లేదు అనే విషయం నెట్లో తెగ వైరల్ అవుతుంది అసలు వీళ్ళ మద్య ఎందుకు గొడవలు వచ్చాయి అనే విషయం లోకి వెళ్తే. బాలయ్య ఎన్టీయార్ ని టిడిపి పార్టీ తరుపున ప్రచారానికి రమ్మంటే తను ఏ రకం గా కూడా రెస్పాండ్ కాలేదట దాంతో బాలయ్య ఎన్టీయార్ ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది.అందుకే వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల నుంచి మాటలు లేనట్లుగా తెలుస్తుంది.అందుకే ఎన్టీయార్ కి సంభందించిన ఏ పార్టీ లో, ఫంక్షన్ లో బాలయ్య కనిపించడం లేదని తెలుస్తుంది.ఈరోజే ఎన్టీయార్ కొరటాల సినిమా కి సంభందించిన ముహూర్తం ఈ మంత్ 23 వ తేదీన జరగబోతుంది అని ఆ సినిమా టీమ్ నుంచి ఓ అప్డేట్ కూడా వదిలారు.ఈ సినిమా మీద ఎన్టీయార్ కి కానీ, ఆయన అభిమానుల్లో కానీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ఎన్టీఆర్ ని ఆస్కార్ లెవెల్ కి తీసుకెళ్లిన తర్వాత తీసే సినిమా కనుక ఈ కొరటాల సినిమా మీద అభిమానులు మరియు మేకర్స్ భారీ ఎస్టిమేషన్ తో ఉన్నారు.